16, ఫిబ్రవరి 2012, గురువారం

శరణు శరణు శ్రీ సాయినాధ

శరణు శరణు  శ్రీ సాయినాధ
శరణన్నామయ్య
నింబ వృక్షనీడను శయనించే
నిర్నల హృదయ విహారీ దేవా...

కాణిపాకమునందు కొలువున్న
శ్రీ వరసిద్ది  వినాయక
ఏడు కొండలు  ఎక్కిఛూడగ
వెంకట రమణుడు నీవయ్యా

యాదగిరి నందు పూజలందుకొను
శ్రీ లక్ష్మి నరసింహా
మమ్ము బ్రోవగ శిరిడీ నందు
నెలవై వున్నా దత్త స్వరూప

రత్నగిరి నందు విరాజిల్లు
శ్రీ సత్యనాధుడవు నీవుకదా
సింహగిరి పైన చందనపు
పూజలందు కునే శ్రీ వరహరూప

శ్రీ శైలమందు మల్లికార్జునా
చిలుకూరు నందు బాలాజి
రూపమేదయిన భక్తులకాచు
ద్వారకమాయి శిర్డి సాయి...

1, ఫిబ్రవరి 2012, బుధవారం

సన్మార్గము చూపుమా

సాయి... సాయి బాబా...
షిర్డి.. సాయిబాబా....
నిత్యం నిను కొలిచే  భక్తుల..
కాపాడగ రావా...               // సాయి//
పేదా ధనిక భేదమె లేదు..
నీ సన్నిదిలో.. ఓ కరుణామయ..
శాంతి సౌఖ్యం కలిగించి..
దారిచూపుమా దయామయా  // సాయి//

ఆకలి గొన్నా అన్నార్తులకు..
రొట్టెలు పంచిన సహృదయా..
మా కోపాలను తొలగించే
మార్గము చూపుమ మహొదయా  // సాయి//

నీటితో దీపాలను వెలిగించిన
ఓ  నిర్మల హృదయా....
మాపాపాలను తోలగింపగ..
రావా ఓ చిన్మయా...                  // సాయి//



31, జనవరి 2012, మంగళవారం

ఏమని పిలిచెదరా సాయి...

ఏమని పిలిచెదరా సాయి...
ఏవిది కొలిచెదరా....


అనుదినము..నీనామామృతమును..
గ్రోలుతు వున్నా... తీరదు దాహము..
ప్రతిదినము...నీ రూపము కన్నా...
అంతే చిక్కదు..ఏ పరమార్ధము
...


చిరునవ్వుతో  దీవించే సాయి ..
చిక్కులు మాన్పగ దరి రావోయి.....//ఏమని//

ప్రతి పువ్వు నీదరి చేరాలని
అరవిరిసినవి లెండి వనమున..
ప్రతి గోవు  తన క్షీరమునంతా
నీ కొరకై  తన పొదుగున దాచగ


వాటి  కొర్కెలను తీర్చేవు...
ఏ నాటికి  నాపై దయచూపేవు...//ఏమని
//

సర్వ నదులు నీ పదగమనములుగ
సూర్య చంద్రులు కనుపాపలుగ
విశ్వమంత నీ ప్రతి రూపముగ 
సర్వ జనులకు మూలము నీ వెగ


ధత్తాత్రేయ స్వరూప సాయి
దారిద్ర్యము తీర్చగ రావోయి..        //ఏమని//

18, జనవరి 2012, బుధవారం

సాయి నామము.

సాయినామమే మధురం
సాయి ధ్యానమింకా మధురం
సాయిని పూజించేచోటే
సర్వశుభములకు నిలయం....
   సాయిరాం...సాయిరాం....

పాలకోవ ప్రసాదము..సాయికి..
గులాబీలు ప్రీతిపాత్రము...
జైబోలో..సాయి..అంటే..
కరుణించే కలియుగ దైవం..
    సాయిరాం..సాయిరాం..

వేకువతోనె మొదలు..సాయికి..
వెలుగునింపు హారతులు....
భక్తుల సందడితో మొదలు..
గుడిలోని  ప్రార్ధనలు...
సాయిరాం..సాయిరాం...

షిర్డి..ప్రవేశమే..
సర్వధుఖ: పరిహారం..
కొరిన కోరికలను తీర్చు..
ద్వారకామాయి..వాసం..
సాయిరాం..సాయిరాం..







28, డిసెంబర్ 2011, బుధవారం

సాయిరాం...ఓం సాయిరాం.

షిర్దిగ్రామం... నందర్శింపగ రండి.
సాయి నివాసం... స్వర్గధామ మండి.

సాయిరాం...ఓం..సాయిరాం...//షి//

పాపములను మాపగల్గు ధుని
పంచాక్షరీ మంత్రపు ప్రతి ద్వని
ప్రశాంతతకు నిలయమైన ఆమని
పులకరించి పోతున్నది
అన్నివిధముల అవని        //షి//

సర్వమత సమానతకు ఇది నిదర్శనం
ధివ్యకాంతులను చిందెసమాదిమందిరం
దర్శించినవారికి లేదులేమరు జన్మం
చూచితరించుటే పూర్వజన్మసుకృతం    //షి//

రంగు రంగు పూవులతో విరిసిన లెండీవనం
సాయిపాదుకల రక్షగ మహల్సాపతి నిలయం
ఎటుచూచిన కదలాడే భక్తజన సందోహం
సాయి ఉనికి తెలిపిన కండోభా దేవాలయం //షి//