ఏమని పిలిచెదరా సాయి...
ఏవిది కొలిచెదరా....
అనుదినము..నీనామామృతమును..
గ్రోలుతు వున్నా... తీరదు దాహము..
ప్రతిదినము...నీ రూపము కన్నా...
అంతే చిక్కదు..ఏ పరమార్ధము...
ప్రతి పువ్వు నీదరి చేరాలని
అరవిరిసినవి లెండి వనమున..
ప్రతి గోవు తన క్షీరమునంతా
నీ కొరకై తన పొదుగున దాచగ
వాటి కొర్కెలను తీర్చేవు...
ఏ నాటికి నాపై దయచూపేవు...//ఏమని//
సర్వ నదులు నీ పదగమనములుగ
సూర్య చంద్రులు కనుపాపలుగ
విశ్వమంత నీ ప్రతి రూపముగ
సర్వ జనులకు మూలము నీ వెగ
ఏవిది కొలిచెదరా....
అనుదినము..నీనామామృతమును..
గ్రోలుతు వున్నా... తీరదు దాహము..
ప్రతిదినము...నీ రూపము కన్నా...
అంతే చిక్కదు..ఏ పరమార్ధము...
చిరునవ్వుతో దీవించే సాయి ..
చిక్కులు మాన్పగ దరి రావోయి.....//ఏమని//
చిక్కులు మాన్పగ దరి రావోయి.....//ఏమని//
ప్రతి పువ్వు నీదరి చేరాలని
అరవిరిసినవి లెండి వనమున..
ప్రతి గోవు తన క్షీరమునంతా
నీ కొరకై తన పొదుగున దాచగ
వాటి కొర్కెలను తీర్చేవు...
ఏ నాటికి నాపై దయచూపేవు...//ఏమని//
సర్వ నదులు నీ పదగమనములుగ
సూర్య చంద్రులు కనుపాపలుగ
విశ్వమంత నీ ప్రతి రూపముగ
సర్వ జనులకు మూలము నీ వెగ
ధత్తాత్రేయ స్వరూప సాయి
దారిద్ర్యము తీర్చగ రావోయి.. //ఏమని//
దారిద్ర్యము తీర్చగ రావోయి.. //ఏమని//

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి