28, డిసెంబర్ 2011, బుధవారం

సాయిరాం...ఓం సాయిరాం.

షిర్దిగ్రామం... నందర్శింపగ రండి.
సాయి నివాసం... స్వర్గధామ మండి.

సాయిరాం...ఓం..సాయిరాం...//షి//

పాపములను మాపగల్గు ధుని
పంచాక్షరీ మంత్రపు ప్రతి ద్వని
ప్రశాంతతకు నిలయమైన ఆమని
పులకరించి పోతున్నది
అన్నివిధముల అవని        //షి//

సర్వమత సమానతకు ఇది నిదర్శనం
ధివ్యకాంతులను చిందెసమాదిమందిరం
దర్శించినవారికి లేదులేమరు జన్మం
చూచితరించుటే పూర్వజన్మసుకృతం    //షి//

రంగు రంగు పూవులతో విరిసిన లెండీవనం
సాయిపాదుకల రక్షగ మహల్సాపతి నిలయం
ఎటుచూచిన కదలాడే భక్తజన సందోహం
సాయి ఉనికి తెలిపిన కండోభా దేవాలయం //షి//


3 కామెంట్‌లు:

  1. కూచి'మంచి' వారికి అభినందనలతో...

    సాయి నాధుడు చేయగ సాయ మెపుడు
    శంకరుండును దీర్చగ శంకలన్ని
    భారతీ దేవి కృపగల్గి భార మనక
    భక్తి గీతపు మీబ్లాగు బాగ సాగు.

    రిప్లయితొలగించండి
  2. శాస్త్రి గారు,
    బాలగీతానికి... మెచ్చి
    అందిచారు శుభాభినందనలు
    భక్తి గీతానికి... ఇపుడిచ్చారు..
    ఆశీర్వాదములు.....
    మీపద్యానికి ఇవే నాప్రణామములు

    రిప్లయితొలగించండి
  3. శాస్త్రి గారు,
    బాలగీతానికి... మెచ్చి
    అందిచారు శుభాభినందనలు
    భక్తి గీతానికి... ఇపుడిచ్చారు..
    ఆశీర్వాదములు.....
    మీపద్యానికి ఇవే నాప్రణామములు

    రిప్లయితొలగించండి